ఆ ఇసుక లారీలెవరివి..? ట్రాక్టర్లతో డంపింగు లారీలతో తరలింపు
March 12, 2025
కన్నెత్తి చూడని మైనింగ్, రెవెన్యూ,పోలీస్ యంత్రాంగం.
చోటా నాయకుల పనితీరుతో ఎమ్మెల్యేకి చెడ్డ పేరు.
అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని ప్రజల కోరిక.
పెదకూరపాడు
నియోజకవర్గంలో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో ఇసుక లారీలు వెళ్తున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు .ఉదయం ట్రాక్టర్ల సాయంతో డంపు చేసుకున్న ఇసుకను రాత్రులు లారీలకు లోడ్ చేయించి ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తున్నారని స్థానిక ప్రజల తెలిపారు. అచ్చంపేట మండలం నుంచి కొత్తపల్లి,కోగంటి వారి పాలెం, ప్రాంతాలలోని ఇసుక రిచ్ ల నుంచి రాత్రి వేళల్లో ఇసుక లారీలు తరలి వెళ్తున్నాయని స్థానికులు తెలిపారు. ట్రాక్టర్ల ద్వారా సేకరించి ఇసుక చిగురుపాడు గ్రామం నుంచి డంపు చేసి అక్కడి నుంచి ఇసుకను లారీలకు ఎత్తి దూరప్రాంతాలకు తరలించి అధిక ధరలకు అమ్ముతున్నారని స్థానిక ప్రజలు తెలిపారు. అమరావతి మండలంలోని మల్లాది దిడుగు గ్రామాల నుంచి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో ఇసుకను లారీలలో తరలిస్తున్నారని స్థానిక ప్రజలు తెలిపారు. రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం మైనింగ్ అధికారులు తెలిసి కూడా అటువైపు కన్నెత్తి చూడలేదని స్థానిక ప్రజలు తెలిపారు. నదీ పరివాహ ప్రాంతంలో ఉన్న ఏ రిచ్ కి అనుమతులు లేవని నిపుణులు తెలిపారు. స్థానిక నేతలే ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యే అనుమతి లేకుండానే రాత్రి వేళల్లో ఇసుక తరలిస్తున్నారని ప్రజలు తెలిపారు. ఇలా ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఇసుక తరలిస్తున్న వారిపై ఎమ్మెల్యే తగు చర్యలు తీసుకోవాలని లేకుంటే నియోజకవర్గంలో తనకున్న పేరు ఇలాంటి చోట నాయకుల వల్ల పోయే అవకాశాలు ఉన్నాయని కూటమి అభిమానులు నాయకులు కోరారు. ఉచితంగా ఇచ్చే ఇసుకను అడ్డదారుల్లో డంపింగ్లు చేసి లారీల్లో తరలించే వారిపై అధికారులు ఎమ్మెల్యే తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని నియోజకవర్గ ప్రజలు కోరారు.