విజయవాడ : బెంజ్ న్యూస్
January 09, 2025
బిజీ మానవ హక్కుల మరియు అవినీతి వ్యతిరేక సంస్థ సమావేశం
విజయవాడ : బెంజ్ న్యూస్
విజయవాడ నగరంలో ప్రెస్ క్లబ్ లో బిజీ మానవ హక్కుల మరియు అవినీతి వ్యతిరేక సంస్థ ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ మానవ హక్కుల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, సంస్థ సభ్యులు ప్రతి ఒక్కరిని చైతన్య వంతం చేయాలని తెలియజేశారు. సంస్థ ఉపాధ్యక్షులు గూడూరి ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ, మండల, జిల్లా స్థాయి నుంచి మానవ హక్కుల పట్ల, చట్టాల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మానవ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు సంస్థను సంప్రదిస్తే సంస్థ ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందేలా సంస్థ పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రజక కార్పొరేషన్ చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల సభ్యులు, మహిళా విభాగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గూడూరి ప్రసాద్, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి ని ఘనంగా సన్మానించారు.