రెవిన్యూ పోలీస్ బలగాల తో ప్రహరీ గోడ తొలగింపు....

గుంటూరు జిల్లా,ఫిరంగిపురం మండలం రెవిన్యూ పోలీసు బలగాలతో ప్రహరీ గోడను తొలగించేందుకు అధికారులు ముందుకు వచ్చారు... వివరాల్లోకి వెళితే పొనుగుపాడు సర్వే నెంబరు 514 లో ఉన్న 80 సెంట్లు విస్తీర్ణంలో రామాలయం కింద 45 సెంట్లు, ముస్లింల స్మశాన వాటిక కింద 25 సెంట్లు, క్రైస్తవుల దేవాలయం కింద తో ఉన్న గ్రామ కంటకంలో ప్రభుత్వ సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.. ఈ నేపథ్యంలో ఎస్సీ కాలనీ లో ఉన్న ఫాతిమా మాత దేవాలయం వెనుక వైపు ఏర్పాటు చేయాలనుకున్న సీసీ రోడ్లు నిర్మాణాన్ని క్రైస్తవ కుటుంబాలు అడ్డుకున్నాయి... అప్పట్లో అధికార పార్టీలో ఉన్న తెదేపా నాయకులు గ్రామస్తుల మధ్య వివాదంగా మారింది..
దీంతో సీసీ రోడ్డు నిర్మాణం పనులు నిలిచిపోయాయి దీంతో అధికారులు ఏమి చేయలేకపోవడంతో ఇరు వర్గాల వారు ఫిర్యాదులతో విషయం కాస్త వివాదాస్పదమై కోర్టు వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది... ఈ క్రమంలో ఫాతిమా మాత దేవాలయానికి వెనక వైపు రహదారి మాకు వద్దు అంటూ రాతి గోడను2018 క్రైస్తవులు నిర్మించారు... ఈ విషయంపై ఫిరంగిపురం పోలీసు స్టేషన్లో ఇరు వర్గాల వారిపై సివిల్ కేసులు ఉండడంతో ప్రహరీ గోడ వివాదం కాస్త సమస్యగా మారి జటిలమైంది.. ఇదిలా ఉంటే కోర్టు వివాదంలో ఉన్న ఈ విషయంపై అధికార పార్టీ అండదండలతో, రెవిన్యూ, పోలీస్, బలగాలు మోహరించి, వివాదంలో ఉన్న ప్రహరీ రాతి గోడ తొలగించేందుకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా.. అడ్డుకున్న వారిని అరెస్టు చేస్తామంటూ పోలీసులు హైడ్రామా కు తెరతీశారు... 1903 పొనుగుపాడు లో నెలకొల్పిన ఫాతిమా మాత దేవాలయం భక్తుల మనోభావాలు దెబ్బ తినే విధంగా వ్యవహరించిన అధికారుల తీరు... చూస్తే గ్రామస్తులకు ఆశ్చర్యం కలిగించింది...
ఏది ఏమైనా పటికి అధికార పార్టీ అండదండలతో క్రైస్తవ మహిళలు దేవాలయం యొక్క సోలార్టీ సభ్యులు మనోభావాలను దెబ్బతినేల వ్యవహరించిన రెవిన్యూ,పోలీసుల తీరును స్థానిక మహిళలు ప్రశ్నిస్తున్నారు. ప్రహరీ గోడ తొలగించేందుకు వచ్చిన పోలీసులు అడ్డుకున్న కొందరు మహిళలను అరెస్టు చేయడంతో కాలనీవాసులు వెనక్కి తగ్గారు... ప్రహరి రాతి గోడ తొలగించేందుకు జెసిపి సహాయంతో అధికారులకు అడ్డుగా ఉన్న రాతి గోడను తొలగించి ఆ మార్గంలో నీటి తూములు ఏర్పాటు చేస్తూ రోడ్డు నిర్మాణం చేపట్టారు.