పెదకూరపాడు .బెంజ్ న్యూస్
మండల పరిధిలోని లగడపాడు గ్రామంలో మాజీ సీఎం స్వర్గీయవైయస్ రాజశేఖర్ రెడ్డి 75 పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.స్థానిక నాయకులు భక్తుల కోటేశ్వరరావు భక్తుల రాజేంద్ర ఆధ్వర్యంలోఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బత్తల కోటేశ్వరావు మాట్లాడుతూబడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జనహృదయనేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి సందర్భంగా గ్రామంలో పేదలకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఆరోగ్య ప్రదాత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి బుడ షేక్ మహబూబ్ సుభాని గ్రామ సర్పంచ్ వేమవరపు నాగేశ్వరరావు ఖాదర్ బాషా హాసన్ దాసరి మోహన్ ఆర్లయ్య మస్తాన్ తదితరులు పాల్గొన్నారు