గింజ బియ్యం బయటకు వెళ్ళకూడదు అంటూ హుకుం జారి చేస్తున్న దళారి. ఎమ్మెల్యే అనుమతిచ్చారు మీరు బియ్యం ఇచ్చి తీరాల్సిందే ... పెదకూరపాడు

పెదకూరపాడు బెల్లంకొండ మండల కేంద్రాల్లో విపరీతంగా ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం టన్నులకొద్ది పక్కదారి పడుతుందని ప్రజలు తెలిపారు రేషన్ బియ్యం తినని వారి వద్ద నుంచి 12 రూపాయలకు కొనుగోలు చేసి 22 రూపాయలకు బయట మిల్లర్లకు అమ్ముతున్న దళారీలపై ప్రభుత్వ
శాఖఅధికారులు మౌనం వహిస్తున్నారని స్థానిక ప్రజలు తెలిపారు. ఏ గ్రామంలో రేషన్ బియ్యం కొనుగోలు చేసిన తనకే ఇవ్వాలంటూ హుకుం జారీ చేస్తూ కొందరుదళారులు భయభ్రాంతులకు గురి చేస్తూ రేషన్ డీలర్ల వద్ద నుంచి ఎండిఎం వాహనాల వద్ద నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి నకరికల్లు పరిసర ప్రాంతాలకు రాత్రి వేళలో గుట్టు చప్పుడు కాకుండా పెదకూరపాడు నుంచిటన్నుల కొద్ది టన్నుల కొద్ది రేషన్ బియ్యంవివిధ వాహనాల ద్వారా తరలిస్తున్నారని స్థానిక ప్రజలు తెలిపారు.రేషన్ బియ్యం ఏ రూపంలో కొన్న కోడిగుడ్లు అమ్ముకునే వారైనా సరే రేషన్ బియ్యం కొంటె ఊరుకోమని కొన్నా మాకే ఇవ్వాలని బెదిరిస్తున్నారని వారు తెలిపారు ఇటీవల పొడపాడుకు చెందిన ఓ కోళ్ల ఫార ఓ కోళ్ల ఫార వ్యాపారిని బెదిరించిన వైనం పెదకూరపాడు మండలంలో నెలకొంది. తాను కూడా పార్టీ వ్యక్తిని తన కోళ్లను బతికించుకునేందుకు దాన్యం అవసరమని ఆ వ్యక్తి జవాబు ఇచ్చారు. నీవు కొనడానికి వీలులేదు కొనాలనుకుంటే అవసరమైతే మా దగ్గర ₹20 కొనుగోలు చేయమంటూ బెదిరిస్తున్నట్లు ఆరోపణ వినిపిస్తున్నాయి.చిల్లరిగాబలుబలుసుపాడు లాంటి గ్రామాలలో ఎవరైనా ఐదారు క్వింటాల బియ్యం కొనుగోలు చేసుకుంటే ఈ దళారులే పోలీసులకు దగ్గరుండి పట్టిస్తున్నారని పలువురు ఆరోపించారు. మరి టన్నులు కొద్ది వీరు బియ్యం చేరవేస్తుంటే వీరుని పట్టించుకోరా వీరికి ఉందంటే వారికి లేనిదేంటి అందరూ చేస్తున్న చీకటి వ్యాపారమే కదా అలాంటప్పుడు ఒక్కొక్కరికి ఒక న్యాయం అందరూ ప్రజలను దోచుకోవడం దాచుకోవడం తప్ప వరగబెట్టింది ఏమీ లేదని ప్రజలు అంటున్నారు అధికారులు మారకుంటే రానున్న రోజుల్లో ప్రజలే ఈ చీకటి వ్యాపారులకు బుద్ధి చెబుతారని వారికి కొమ్ము కాసే నాయకులకు బుద్ధి చెబుతారని ప్రజలు తెలిపారు .