పెదకూరపాడు బెంజ్ న్యూస్
సమాజంలో చెడును నియంత్రించాల్సిన పోలీసు యంత్రాంగం నెలవారి మామూళ్లకు కక్కుర్తి పడి అక్రమ ఇసుక రవాణా అక్రమ రేషన్ బియ్యం అనధికార బెల్ట్ షాపులకు కొమ్ముకాస్తూ మామూళ్ల మత్తులో మునిగిపోయారని మండల ప్రజలు,నిపుణులు తెలిపారు. పోలీస్ యంత్రాంగం స్పెషల్ ఎన్ఫోర్మెంట్ బ్యూరో అధికారులు విజిలెన్స్ అధికారులు అనాధికారంగా జరిగే ప్రతి కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు అనే విమర్శలు నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా వస్తున్న కస్తాల,కోనూరు, మల్లాది ఇసుక ట్రాక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ముడుపుల మత్తులో పోలీసు యంత్రాంగం తేలాడుతున్నారని మండల ప్రజలు తెలిపారు. రోజు నిత్యం పదుల సంఖ్యలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని నెలలో ఒకటో తారీకు నుంచి 15వ తారీఖు వరకు రేషన్ అక్రమ రవాణా జరుగుతున్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మద్యం ఏరులై పారుతున్న పట్టీ పట్టనట్టు పోలీస్ యంత్రాంగం వ్యవహరిస్తుందని మండల ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని గండుకొడుతూ దళారులు అక్రమాణ చేపడుతుంటే నెలవారి మామూళ్లకు అలవాటు పడిన పోలీస్ యంత్రాంగం అక్రమ రవాణాలకు అండగా ఉంటూ దాచుకో దోచుకో అన్న చందన మండల ప్రజలను నదీ భూగర్భ జలాలను పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని దోచుకుంటున్నారని ప్రజలు అన్నారు.
సీఐ మంగారావు వివరణ
ఇసుక ట్రాక్టర్లు వెళుతున్నాయని తెలియజేసినప్పటికీ పరిశీలిస్తాం చర్యలు తీసుకుంటామన్నారు.