అనుమతులు లేవు ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు
చేతులెత్తేసిన రెవెన్యూ యంత్రాంగం
చెరువులో మట్టి అంతా అమ్ముకుంటున్న స్థానిక నాయకులు
పెదకూరపాడు బెంజ్ న్యూస్
కంచ చేను మేసింది అన్న చందన మండలంలోని అబ్బు రాజుపాలెం పలు గ్రామాల్లో ఇష్ణరాజ్యంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయనిఆయా గ్రామాల ప్రజలు ఆరోపించారు. కొన్ని గ్రామాల్లో పంచాయతీ తీర్మానం చేసుకుని తాసిల్దార్ అనుమతి లేకుండా మైనింగ్ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. అదేమని ప్రశ్నించిన వారిపై కాలు దువ్వు తున్నారనిస్థానిక ప్రజలు తెలిపారు. ఇష్టారాజ్యంగా జెసిబి ప్రోక్లైన్ల సాయంతో చెరువుల్లో మట్టి ఉమ్మడి భూముల్లో మట్టి ప్రభుత్వ భూముల్లో మట్టి స్థానిక నాయకులకు కనున్నల్లో తవ్వకాలు జరుగుతున్నాయని ప్రజల ఆరోపిస్తున్నారు. వీఆర్వో ని అడిగితే పంచాయతీ కార్యదర్శి మీద, పంచాయతీ కార్యదర్శులు అడిగితే తాసిల్దార్ మీద తాసిల్దార్ని అడిగితే ఎంపీడీవో మీద చెప్పుకుంటూ మాకేమి సంబంధం లేదన్నట్లు అధికారులు చేతులు దులుపుకుంటున్నారని అబ్బు రాజుపాలెం గ్రామం వాసులు తెలిపారు. మైనింగ్ అనుమతులు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరే విధానాన్ని తుంగలో తొక్కి సొంత ఆదాయాన్ని పెంచుకునేందుకు స్థానిక నాయకులు అప్పుడే విచ్చలవిడి తనం మొదలు పెట్టారని స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు. నిద్రవస్త్రలో ఉన్న రెవెన్యూ యంత్రాంగం, సాకులు చెప్పుకుంటున్న పంచాయతీ అధికారులు, భూగర్భ జలాలను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నదళారులపై కనీసం తొంగి చూడని మైనింగ్ అధికారులు ఉన్నతకాలం గ్రామాలు బాగుపడవు అభివృద్ధి చెందదని నిపుణులు అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇప్పటికైనా అక్రమంగా జరుగుతున్న మైనింగ్ మట్టి మాఫియాని అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.
తాసిల్దార్ ప్రభాకర్ రావు వివరణ
ఆయన తెలిపిన గ్రామాల్లో అనుమతులు లేకుండా మట్టితోవ్వకాలు జరుపుతున్నాయని దృష్టికి తీసుకువెళ్లిన అనంతరం స్పందన లేకుండా ఫోను ఎత్తకుండా అక్క మట్టి తాగకుండా అండగాస్తున్నారు. ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేయాలని మండల ప్రజలు కోరారు.