బెంజ్ న్యూస్.ట్రైన్ (నాగోన్ ఎక్స్ప్రెస్) లో పొగలునెల్లూరు జిల్లా కావలి సమీపంలోనఅడవిరాజుపాలెం-సిరిపురం రైల్వే గేటు వద్ద నాగోన్ ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ ట్రైన్ ను నిలిపివేశారు. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు దిగి పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది ఘటనా స్థలికచేరుకుని మరమ్మతులు చేశారు. బ్రేక్ డౌన్ వల్లే పొగ వచ్చిందని తెలిపారు.నాగోన్ ఎక్స్ప్రెస్ రైలు అస్సాం రాష్ట్రంలోని సిగాట్ నుంచి తమిళనాడు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మరమ్మతుల అనంతరం రైలు బయలుదేరింది.