మేడికొండూరు బీజేపీ మండల సమావేశం పాలడుగు గ్రామంలో జరిగిన ఈ
March 12, 2025
సమావేశంలో మండల అధ్యక్షులు భాషా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు చెరుకూతిరుపతిరావు గు విచ్చేసి వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో జిల్లాలోని అన్ని మండలాల్లో పార్టీని అభివృద్ధి చేసుకోవాలని మన ప్రధానమంత్రి ఇస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ చేరువయ్యే విధంగా వారందరితో మమేకమై లబ్ధిదారులను కలవాలని అన్నారు. అదేవిధంగా కేంద్రంలో NDA ఎంతో బలంగా ఉందో ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అంతే బలంగా ఉందని అన్నారు. దేశంలో రాష్ట్రంలో ఒకే కూటమి ప్రభుత్వం ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకు వెళ్తుంది అని అన్నారు. కేంద్రంలో రాష్ట్రం లో డబల్ ఇంజన్ సర్కార్ ఉండటం వల్లనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతంగా అవుతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా ముందుకు తీసుకెళ్తున్నారని అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలుగా ఆర్థికపరమైన అన్నిటిని సమకూర్చి ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి విషయంలో భాగం అవుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ కి ఎంతో అండగా ఉంటుందని అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం నిధులను ఇచ్చిందని అన్నారు. రాబోయే రోజుల్లో మేడికొండూరు మండలంలో బీజేపీ ఎంపీటీసీ జడ్పిటిసి, సర్పంచ్ ఎలక్షన్స్ లో మనం పోటీ చేసి గెలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పదాధికారి కొక్కెర శ్రీనివాస్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్సులు వై వి సుబ్బారావు, చరక కుమార్ గౌడ్, తాడికొండ అసెంబ్లీ కన్వీనర్ కంతేటి బ్రహ్మయ్య, మాజీ మండల అధ్యక్షులు ఆమతి వెంకటరమణ, యువ మర్చ జిల్లా ఉపాధ్యక్షులు చిలకా బాలకోటయ్య గౌడ్, మండల ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, కార్యదర్శులు కోశాధికారి, మండలంలోని బూతు అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది