అమరావతి, సచివాలయం 22-1-25
January 22, 2025
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తిమ్మమ్మ మర్రిమానును పర్యాటక ప్రదేశంగా అభివృద్ధికి తక్షణo నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కి ఆదేశాలు పంపడం జరిగింది
తిమ్మమ్మ మర్రిమానును పర్యాటక ప్రదేశంగా అభివృద్ధితో పాటు అక్కడ చేపట్టవలసిన పనులకు నిధులు మంజూరు చేయాలని గత సంవత్సరం డిసెంబర్ 27వ తారీఖున
వినతి పత్రమును ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసి అందజేసిన అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ )జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు స్పందించిన ముఖ్య మంత్రి కార్యాలయం లేఖను రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి పంపారు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి ఆదేశాలను టూరిజం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టరు కు పంపటం శుభ పరిణామం అని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అన్నారు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు
1) స్వాగత ముఖద్వారాలు
(Arches)
a) మదనపల్లి - కదిరి హైవే మార్గమధ్యలో - కొక్కంటి క్రాస్ వద్ద ఒకటి.
b) కదిరి - రాయచోటి రోడ్డు మార్గమధ్యలో - రెక్కమాను వద్ద ఒకటి
c)తిమ్మమ్మ మర్రిమాను హై స్కూల్ క్రాస్ వద్ద ఒకటి
2) డబుల్ రోడ్డు - కదిరి నుండి
కొక్కంఠి క్రాస్ రోడ్ వరకు
3)విశ్రాంతి గదులు మరియు
పబ్లిక్ టాయిలెట్స్.
4) ఓబులేసు గుట్ట మీదున్న TTD., వారిచే నిర్మించబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయమునకు విగ్రహం ఏర్పాటుతో పాటు అసంపూర్తిగా ఉన్న రోడ్డు మరియు నీటి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి
5)బస్ షెల్టర్ మరియు షాపింగ్ complex నిర్మాణం.
6)గొల్లవాని కుంటకు మరమ్మతులు మరియు బోటింగ్ సౌకర్యం.
7)తిమ్మమ్మ మర్రిమాను నుండి పెదబల్లికి రోడ్డు (అటవీ ప్రాంతం) నిర్మించుట వలన 10 కిలోమీటర్ల దూరం తగ్గుదల.
8)తిమ్మమాంబ కు చెందిన భూమిలో కళ్యాణ మండపము, కమ్యూనిటీ హాలు , వసతి గదులు మొదలుగునవి.
9)తిమ్మమ్మ గారు నివసించిన గంగరాజు ల కోటవద్ద వసతి గృహాలు, టాయిలెట్స్
10) గంగరాజు ల కోట చుట్టూ 20 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణము.
11) తిమ్మమ్మ మర్రిమాను అభివృద్ధి కి గ్రామస్థుల నుండి అటవీ శాఖ సేకరించిన 26.48 ఎకరముల భూమిలో యాత్రికుల సౌకర్యార్థం కల్పించవలసిన పనుల కోసం కనీసం 5 ఏకరముల భూమిని కేటాయించాలి. బస్టాండ్, షాప్ రూములు,గుడికి వెళ్ళడానికి దారి మార్గం, తిమ్మమ్మ తల్లి రథం ఊరేగింపు తదితర అవసరాల కోసం.
12)ఈశ్వరమల కొండపైకి మెట్ల దారి నిర్మాణం.
13) ఈశ్వరమాల కొండ 500 మీటర్ల ఎత్తులో తిమ్మమ్మ మర్రిమాను చూసే విధంగా view point నిర్మాణం. మరియు view point చేరుకోవడానికి రోడ్డు నిర్మాణం.
14) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయమునకు రోడ్డు.
15) సువిశాలమైన అమూస్మెంట్ పార్క్, ఆట స్థలం తదితర పనులు.
16) ఒక ఆధ్యాత్మిక కేంద్రము.
17)ఈశ్వరామల కొండ మొత్తము పచ్చగా, పొడవుగా పెరిగే ఎత్తైన చెట్లను పెంపకము.
18)తిమ్మమ్మ మర్రిమాను నుండి గాజులవారిపల్లికి
కదిరి - రాయచోటి మైన్ రోడ్డుకు లింక్ రోడ్డు, సామాలగొంది మీదుగా.