కడప, 19-01-25

డాక్టర్ జాస్తి వీరాంజనేయులుకు ఘన సన్మానం చేసిన కడప జిల్లా సర్పంచుల సంఘం మరియు సామాజిక సేవ సంస్థ అధ్యక్షులు నార్ల ప్రకాశం ఈ రోజున కడప లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సామాజిక సేవా సంస్థ అధ్యక్షులు నార్ల ప్రకాశం ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ జాతీయ కన్వెన్షన్ నిర్వహించినారు.. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కడప, కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, సర్పంచులు కొత్తపు లోకేశ్వరి మునిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం మాజీ ఉపాధ్యక్షులు వెన్నపూస అరవిందనాథ్ రెడ్డి, కర్ణాటక గ్రామపంచాయతీ ఫెడరేషన్ జనరల్ సెక్రెటరీ ఏఎం చలపతి, కేంద్ర ప్రభుత్వ పీపుల్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా నేషనల్ భారత్ సేవా సమాజ్ చైర్ పర్సన్ డాక్టర్ సుమన శ్రీనివాసన్ మరియు సర్పంచులు, స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొని జాతీయస్థాయిలో గ్రామపంచాయతీల బలోపేతం మరియు స్థానిక సంస్థల బలోపేతం సమస్యలపైన అనేక సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తోటి సంప్రదింపులు జరుపుతున్న సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ రోజున కడపలో ఘన సన్మానం నిర్వహించారు శాలువా, పూల బొకే మెమొంటో, ప్రశంసా పత్రం తో సత్కరించారు