14 న గ్రామదేవత శ్రీదేశమ్మతల్లి పొంగళ్ళు

 


పెదకూరపాడు బెంజ్ న్యూస్

పల్నాడు జిల్లా

,75త్యాల్లూరు గ్రామదేవత శ్రీదేశమ్మతల్లి పొంగళ్ళు 14వ తేది ఆదివారం నిర్వహించనున్నట్లు ఆలయకమిటి  తెలిపారు.ప్రతి ఏటా ఆషాఢ మాసంలో రెండవ ఆదివారం అమ్మవారికి ఉత్సవం జరుగుతుంది.శుక్రవారం నుండి ఐదుపూటలా జలబిందెలతో చిన్నలు పెద్దలు మహిళలు వారుపోస్తారు.ఆదివారం ఉదయం గ్రామ ఉమ్మడి పొంగలి,,పెదకాపు పొంగలి చేసి అమ్మవారికి నివేదన చేస్తారు.అనంతరం భక్తుల మొక్కుబడులు చెల్లించడానికి సామూహికంగా మేళతాళాలతో ప్రభను కట్టుకుని మహిళలు సాంప్రదాయ పద్ధతిలో నైవేద్యాలు (బోనాలు )సమర్పిస్తారు.సాయంత్రం జాతరలో పోతులను సమర్పించి సామూహిక అన్నసంతర్పణ చేస్తారు.గ్రామాన్ని ,ప్రజలను పాడిపంటలతో కాచి కాపాడే కొంగుబంగరుతల్లి శ్రీదేశమ్మతల్లికి ఎడాడికోమారు ఉత్సవాలు ఘనంగా జరుపుతారు.