ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన 75 త్యాళ్లూరు హైస్కూల్ విద్యార్థిని.

 


      బెంజ్ న్యూస్.పల్నాడుజిల్లా పెదకూరపాడు మండల పరిధి 75త్యాళ్ళూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.తనూజ ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో ప్రతిభ కనపరచి రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో సీటు సాధించినట్లు హెచ్ఎం డాక్టర్ ఎ.శ్రీనివాస రెడ్డి శుక్రవారం తెలిపారు.పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో కూడా ‌తన‌ ప్రతిభతో 563 మార్కులు సాధించి మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధమ స్థానంలో నిలిచింది.ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన‌ తనూజాను, హెచ్ఎం డాక్టర్ ఎ.శ్రీనివాసరెడ్డి  పీసి చైర్మన్ గుత్తికొండ శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు.