పెదకూరపాడు .బెంజ్ న్యూస్
మండల పరిధిలోని 75 తాళ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుడ్ షెఫర్డ్ స్వచ్ఛంద సంస్థ అమరావతి వారిచే కిషోర్ బాల బాలికలకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బత్తుల బాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ నూతక్కి దిలీప్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్నెట్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా పాటించాలని తెలియజేశారు. మొదటిగా సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని అలాగే సోషల్ మీడియాలో మన వ్యక్తిగత వివరాలను ఉంచరాదని అలాగే ఫొటోస్ స్టేటస్లుగా స్టోరీస్గా డీపీలుగా పెట్టవద్దని తెలియజేశారు. ఫోన్ వాడేటప్పుడు పాస్వర్డ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలని అలాగే ఆ పాస్వర్డ్ ని ఇతర వ్యక్తులతో పంచుకోకూడదని తెలియజేశారు. రీఛార్జ్ షాపుల్లో మరియు ఫోన్ రిపేర్ షాపుల్లో పాస్వర్డ్ గానీ మొబైల్ నెంబర్ గాని ఇచ్చి రాకూడదు అని తెలియజేశారు. అలాగే సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడానికి ఏ ఇతర లింకులను ఉపయోగించకూడదు అలాంటి లింకులు వల్ల మన ఫోన్లోకి వైరస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి లింకులు ఓపెన్ చేయకుండా ఉండాలి. పబ్లిక్ ప్లేసుల్లో అనగా బస్టాండ్ లో రైల్వేస్టేషన్లో ఉచిత వైఫై కనెక్ట్ చేసుకుంటే దానివల్ల మన వ్యక్తిగత వివరాలు చోరీ చేయబడతాయని తెలియజేశారు. మనం సైబర్ నేరాలకు గురి అయినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో 75 తాళ్లూరు ఉన్నత పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఈ సైబర్ నేరాలపై అవగాహన పొంది వాటికి గురి కాకూడదు అలాగే ఒకసారి మోసపోవడం తప్పు కాదు కానీ పదేపదే మోసపోకూడదు అని తెలియజేశారు. ఈ వయసులో ఉన్న బాల బాలికలు ఫోన్ వినియోగం తగ్గించాలని చదువుపై దృష్టి సారించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడ్ షెఫర్డ్ స్వచ్ఛంద సంస్థ సుపీరియర్ డైరెక్టర్ సిస్టర్ వినరసి మాట్లాడుతూ బాలబాలికలు ఫోను కు దూరంగా ఉండి చదువుకు దగ్గరగా ఉండాలని అలాగే ఆ నేరాలకు మనం గురికాకుండా ఉండాలని అలాగే మన వ్యక్తిగత వివరాలు ఏ మాధ్యమాలలో పెట్టకూడదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 75 తాళ్లూరు ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులు సిబ్బంది, గుడ్ షెఫర్డ్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది పవన్ కుమార్, మరియమ్మ మరియు బాలబాలికలు పాల్గొన్నారు.