08-04-2025, అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీ

రాష్ట్రంలో పలు సర్పంచులతో సమావేశమై వారి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ని కలిసిన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలువురు సర్పంచ్ లు ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు సర్పంచులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు విపరీతమైన విద్యుత్ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి, విద్యుత్ బిల్లులు చెల్లించలేని స్థితిలో మైనర్ గ్రామపంచాయతీలు ఉన్నాయి. మైనర్ గ్రామ పంచాయతీలకు గతంలో ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించింది. ప్రస్తుతం బిల్లులు విద్యుత్ శాఖ వారు వడ్డీలు, చక్ర వడ్డీలు వేసి లక్షలు కోట్లలో బిల్లులు పంపిస్తున్నారు. కాబట్టి గ్రామ పంచాయతీలకు ఆర్థిక వనరులు పెంపొందించే విధంగా మైనార్ గ్రామ పంచాయతీలకు ఉచిత విద్యుత్తును అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. గ్రామ సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను విడుదల చేయకుండా పంచాయతీ కార్యదర్శులను స్థానిక నేతలు అడ్డుపడుతున్నారని వెంటనే ఆ బిల్లులను విడుదల చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. వాటిలో ముఖ్యంగా గత మూడు సంవత్సరాలుగా 5 వ ఆర్ధిక సంఘం ద్వారా గ్రామపంచాయతీకి రావాల్సిన నిధులను, రావలసిన వాటాను బదిలీ చేయాలని, సర్పంచుల గౌరవవేతనమును 3000/-రూపాయల నుండి 15000/- రూపాయలకు పెంచాలని, సర్పంచులు విధి నిర్వహణలో మరణిస్తే 20 లక్షల వరకు ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని, గిరిజన తండాలను ప్రత్యేకంగా పరిగణించి ప్రత్యేక నిధులు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 15 ఆర్థిక సంఘ మరియు 5 వ ఆర్థిక సంఘం) నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. MGNREGS నిధులను గ్రామపంచాయతీ సర్పంచుల ఆధ్వర్యంలోనే జమ చేయాలని, గతంలో సర్పంచుల ఆధ్వర్యంలోనే పేమెంట్స్ జరిగాయని కానీ ఇప్పుడు MPDO కార్యాలయాల్లో VENDOR CODE క్రియేట్ చేసి పేమెంట్స్ చేస్తున్నారని అలాకాకుండా ఈ పేమెంట్స్ అన్నీ గ్రామ సర్పంచ్ల ఆధ్వర్యంలోనే జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీలకు రావలసిన రిజిస్ట్రేషన్ సర్ -ఛార్జ్ సీనరీలను క్రమం తప్పకుండా పంచాయతీ శాఖలలో జమ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసి ఉప ముఖ్యమంత్రి కి వినతి పత్రం అందచేశారు. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి అక్కడే ఉన్న పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ , పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ V.R. కృష్ణ తేజ, ఉప ముఖ్యమంత్రి O.S.D వెంకటకృష్ణ, వ్యక్తిగత కార్యదర్శి మధుసూదన్ లతో చర్చించారు. అనంతరం ఈ సమస్యలన్నిటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అఖిల భారత పంచాయితీ పరిషత్ (దిల్లీ )జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు గారు, రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు షేక్ అల్లాబక్షు, అండ్రాజు శ్రీనివాసరావు, అనంతగిరి ZPTC సభ్యులు దీసరి గంగరాజు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు గసభ సర్పంచ్ పాంగి సునీత సురేష్, పద్మాపురం సర్పంచ్ పెట్టెలి సుస్మిత, పెదలవుడు సర్పంచ్ పెట్టెలి దాసుబాబు, కొర్రాయి సర్పంచ్ పూజారి కొమ్ములు, బొండం సర్పంచ్, దురియ భాస్కరరావు, టోకూరు సర్పంచ్ కిల్లో మోషేయ్య, అనంతగిరి సర్పంచ్ సోమేలి రూతు, మఠం సర్పంచ్ మఠం శాంతకుమారి, ఉక్కుంపేట సర్పంచ్ సమీడ పూర్ణిమ, బస్కి సర్పంచ్ పాడి రమేష్, దామనపల్లి సర్పంచ్ కుందేరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కి తగిలిన గాయాలు త్వరగా మానిపోయి సాధారణ స్థితికి చేరుకోవాలని భగవంతుని ప్రార్థించారు