అమరావతి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తపు ముని రెడ్డి మరియు అభిమానులు
April 04, 2025
కడప : LYF లవ్ యువర్ ఫాదర్ సినిమా విడుదలైన సందర్భంగా చిత్ర హీరో శ్రీహర్షకు చిత్ర యూనిట్ కు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ )జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తపు ముని రెడ్డి మరియు అభిమానులు
కడపలోని ప్రతాప్ థియేటర్లో ఈ రోజున విడుదలైన LYF లవ్ యువర్ ఫాదర్ సినిమా తొలి షో చూసి చిత్రం హిట్ అయిన సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు,అభిమానులు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ప్రతాప్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ తొలి ప్రయత్నం లోనే తొలి పరిచయంలోనే హీరో శ్రీ హర్ష తన నటన తోటి తన ప్రతిభను చాటుకున్నారన్నారు చక్కటి కుటుంబ కథా చిత్రాలకు పేరుగాంచిన ఫిలిమ్స్ కిషోర్ రాఠి, అన్నపరెడ్డి సామ్రాజ్యం నిర్మించిన చిత్రం హిట్ అయింది హీరో శ్రీహర్ష భవిష్యత్తులో ఒక మంచి సూపర్ స్టార్ అవుతారన్నారు ఎస్పీ చరణ్ నటన కూడా చాలా బాగుంది అన్నారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తపు మునిరెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రం చాలా బాగుందని ప్రతి ఒక్క కుటుంబం చూడాలన్నారు విద్యార్థిని విద్యార్థులకు కూడా ఒక మంచి సందేశాత్మకమైన చిత్రం అని అన్నారు
చిత్ర విశేషాలు
తెలుగు చిత్రం "LYF: లవ్ యువర్ ఫాదర్" (2025) లో శ్రీ హర్ష ప్రధాన పాత్రలో నటించారు, ఇందులో SPB చరణ్, కాశికా కపూర్ మరియు నవాబ్ షా కూడా నటించారు
ప్రధాన నటుడు: శ్రీ హర్ష
ఇతర ప్రముఖ తారాగణం సభ్యులు:
ఎస్పీబీ చరణ్
కాశికా కపూర్
నవాబ్ షా
దర్శకుడు: పవన్ కేతరాజు
సంగీతం: మణి శర్మ
నిర్మాతలు: అన్నపరెడ్డి సామ్రాజ్యం, అన్నపరెడ్డి చేతన్ సాయి రెడ్డి, కిషోర్ రాఠి, మహేష్ రాఠి
సినిమాటోగ్రాఫర్: సామ్ కె నాయుడు