ఆరు డొంకాల రోడ్డు సమీపంలో గుర్తుతెలియని మృతదేహం.

అమరావతి: గుర్తు తెలియని మగ వ్యక్తి సత్తెనపల్లి రోడ్డులో గల ఆరు డొంకల బాయి సమీపంలో మృతి చెందినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు తెలిపారు.వయసు సుమారు 45 సంవత్సరాలు,రంగు ఎరుపు, ఎత్తు 5.7 అడుగులు, మెడలో నల్లపూసల దండ ఉన్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. పై వ్యక్తిని గుర్తుపట్టిన యెడల అమరావతి పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ కోరారు . అమరావతి సీఐ-9440796217 అమరావతి ఎస్ఐ-8555960221 తెలపాలన్నారు.