రాబిన్ హుడ్' సినిమా... డేవిడ్ వార్నర్ కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్
March 27, 2025
నితిన్ సినిమా 'రాబిన్ హుడ్'లో నటించిన డేవిడ్ వార్నర్
మూడు నిమిషాల సేపు ఉన్న వార్నర్ పాత్ర
రూ. 2.5 కోట్ల పారితోషికం అందుకున్నట్టు సమాచారం
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కప్ అందించిన కెప్టెన్ గా ఆయనకు గుర్తింపు ఉంది. తెలుగు సినిమాల పాటలకు స్టెప్పులేసి మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. తన జీవితంలో తొలిసారి సిల్వర్ స్క్రీన్ పై వార్నర్ మెరవనున్నాడు. నితిన్ హీరోగా తెరకెక్కిన 'రాబిన్ హుడ్' సినిమా ద్వారా వార్నర్ తెరంగేట్రం చేశాడు. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించారు.
మరోవైపు, ఈ సినిమాకు వార్నర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో వార్నర్ పాత్ర కేవలం మూడు నిమిషాల పాటే ఉంటుందట. ఇంత తక్కువ సమయానికి కూడా వార్నర్ కు భారీగానే ముట్టచెప్పారట. ఈ సినిమాకు వార్నర్ రూ. 2.5 కోట్లు తీసుకున్నాడని సమాచారం. వార్నర్ రెండు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడట. అంటే రోజుకు రూ. 1.25 కోట్లు తీసుకున్నాడన్నమాట. స్టార్ హీరోలు కూడా ఒక రోజుకు ఇంత తీసుకోరేమో. ఈ సినిమా ప్రమోషన్లలో కూడా వార్నర్ పాల్గొంటున్నాడు.