టన్నులు కొద్దీ రేషన్ బియ్యం మిల్లులకు తరలిస్తున్న వైనం... నిద్ర వస్త లో రెవెన్యూ, పోలీస్, విజిలెన్స్ అధికార యంత్రాంగం

వాటాల కాడ కుమ్ములాట. దొంగ సరుకులు తరలించేందుకు కూడా దొరలా ప్రయత్నం... రేషన్ దందా కి కేరాఫ్ గా మారిన పెదకూరపాడు అమరావతి.. టన్నులు కొద్దీ రేషన్ బియ్యం మిల్లులకు తరలిస్తున్న వైనం...
నిద్ర వస్త లో రెవెన్యూ, పోలీస్, విజిలెన్స్ అధికార యంత్రాంగం,
పెదకూరపాడు- అమరావతి:- అక్రమ రేషన్ బియ్యం రవాణాకు అడ్డగా పెదకూరపాడు అమరావతి మండల కేంద్రాలు నిలిచాయని స్థానిక ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. గత రెండు మాసాలుగా పంపకాల లో తేడా వచ్చి వారిలో వారే కుమ్ములాటకు దిగారని స్థానిక ప్రజలు తెలిపారు. టన్నులకొద్దీ రేషన్ బియ్యం నల్లబదారుకు తరలిపోతుంటే అధికారులు మాత్రం నిదరవస్తులో ఉన్నారని ప్రజలన్నారు. మండలాలను శాసిస్తూ కొందరు సిండికేట్ గా ఏర్పడి గ్రామాలు తిరిగి ఎండిఎం వాహనాలు చౌక ధరల దుకాణాలను సందర్శించి వారు రేషన్ బియ్యం కొనుగోలు చేయాలని వారి వద్ద నుంచి మీరు కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తూ నెలకు లక్షల్లో గడిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకవైపు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నాయుడు వివిధ మిల్లులపై తనిఖీలు చేపట్టి సీట్ చేపిస్తూ కేసులు పెడుతుంటే మరోవైపు మాకేం పట్టిందిలే మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు లే అన్న చందన పెదకూరపాడు అమరావతిలో చోటా నాయకుల అండదండలతో రేషన్ మాఫియా చాప కింద నీరుల ప్రవహిస్తూ రోజురోజుకు తమ సామ్రాజ్యాన్ని పెంచుకుంటుందని స్థానిక ప్రజలు తెలిపారు. ఒకటవ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రతిరోజు ఆయా మండలం నుంచి టన్నుల కొద్ది రేషన్ బియ్యం మిల్లులకు తరలిస్తుంటే నిఘా నేత్రాలు కానీ, సంబంధిత యంత్రాంగం కానీ అటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు అన్నారు. రేషన్ మాఫియా దళారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కట్టడి చేయాలని ప్రజలు కోరారు.