ప్రపంచ వారసత్వ కట్టడంగా లేపాక్షి, గండికోట, అమరావతి ని గుర్తించాలి

ప్రత్యేక నిధులను విడుదల చేసి అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని భారత ప్రభుత్వ పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ ( డిజి) యదుబీర్ సింగ్ రావత్ కు విజ్ఞప్తి చేసిన డాక్టర్ జాస్తి వీరాంజనేయులు జాతీయ ఉపాధ్యక్షులు, అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డోసియర్ ను కేంద్ర ప్రభుత్వానికి త్వరగా పంపాలని డోసియర్ కమిటీ స్పీడ్ గా పనిచేసి (లేపాక్షిని గతంలో యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కింది ) రేపు జూలై 2025 జరగబోయే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఫైనల్ జాబితాలోకి పంపాలంటే రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి త్వరగా డీటెయిల్ దోసియర్ ను కేంద్ర పురావస్తు శాఖ వరల్డ్ హెరిటేజ్ కు పంపాలని కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ యదుబీర్ సింగ్ రావత్ ఈ మేరకు తనను కలిసిన డాక్టర్ జాస్తి వీరాంజనేయులు కు తెలిపారు దిల్లీ లోని తిలకుమార్గ్ లో గల కేంద్ర ప్రభుత్వ భారత పురావస్తు శాఖ కార్యాలయంలో డీజీ యదుభిర్ సింగ్ రావత్ తో ఈరోజు సాయంత్రం 12 వ తారీఖున సమావేశం అయ్యారు ఆంధ్రప్రదేశ్ నుంచి డోసియర్ ను మాకు పంపలేదు అని వరల్డ్ హెరిటేజ్ అధికారులు, డీజీ తెలపడం జరిగింది దోసియర్ ని తొందరగా పంపిస్తే మేము యునెస్కో ఫైనల్ జాబితాలోకి పంపిస్తామని తెలపడం జరిగింది శిల్పకళకు, వర్ణచిత్రాలకు నిలయమైన లేపాక్షి ని యునెస్కో ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు తీసుక రాలేక పోతే ఆంధ్రప్రదేశ్ చారిత్రకంగా పర్యాటకంగా వెనుకబడుతుందని అఖిల భారత పంచాయతీ పరిషద్ (దిల్లీ)జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాoజనేయులు అన్నారు.ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రo లోని 129 పైగా చారిత్రక కట్టడా లలో ఒక్క దానికి కూడా యునెస్కో ఫైనల్ జాబితాలో చోటు దక్కకపోవడం పట్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ లోని అపురూప చారిత్రక కట్టడాలు కు యునెస్కో లో చోటు లేక పొతే ఆంధ్రప్రదేశ్ పర్యటకంగా వెనుకబడి పోతుందని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు పర్యాటక శాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష చేసి డో సియర్ కమిటీని వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను ప్రతిపాదించాలని విజ్ఞప్తి చేశారు లేనిపక్షంలో ఈ సంవత్సరం కూడా జూలైలో జరగబోయే పోటీలలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యునెస్కో గుర్తించబోయే ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కదు అని అన్నారు తాత్కాలిక జాబితాలో చోటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అమరావతి, శాలిగుండం, గండికోట, శంకరం, ప్రతిపాదనలను గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తపు మునిరెడ్డి పాల్గొన్నారు