రాష్ట్రంలో ఉన్న మండల పరిషత్తులకు 15% నుంచి 20% ఆర్థిక
March 18, 2025
రాష్ట్రంలో ఉన్న జిల్లా, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీ
లకు ఆర్థిక సంఘం నిధుల కేటాయింపుల్లో ప్రభుత్వం కొంతమేర మార్పులు
చేసింది గతంలో రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
దాని ప్రకారం కొత్తగా ఇచ్చిన జీవో ఎమ్మెస్ నెంబర్ 25 ప్రకారం రాష్ట్రంలో ఉన్న 660 మండల పరిషత్తులకు మొత్తం ఆర్థిక సంఘం పంపే నిధుల్లో ఇక నుంచి 20 శాతం
కేటాయించనున్నారు. గతంలో ఇది 15 శాతం ఉండేది. జిల్లా పరిషత్తులకు
ఇప్పటి వరకు 15 శాతం నిధుల కేటాయింపు ఉండగా.. దాన్ని 10 శాతానికి తగ్గించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ
పంచాయతీలకు గతంలో మాదిరిగానే 70 శాతం నిధులు కేటాయిస్తారు.
ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి
శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు ఈ సందర్భంగా అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ )జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంక్షేమ సంఘం రాష్ట్ర ముఖ్య సలహాదారు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ రాబోయే 16వ ఆర్థిక సంఘం ప్రస్తుత జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వాలకు పంపే ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తేనే గ్రామపంచాయతీలు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే దానికి ఆస్కారం ఉంటుందన్నారు ఎప్పుడో 2011 జనాభా ప్రాతిపదికన ప్రస్తుత కేటాయింపులు వలన కేంద్రం పంపే నిధులు ఏమాత్రం సరిపోవటం లేదన్నారు గ్రామపంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరులు ఇంటి పన్ను, కుళాయి పన్ను , రిజిస్ట్రేషన్ సర్ ఛార్జ్ ఈ నిధుల తోటి గ్రామపంచాయతీలు మనుగడ సాధించటం కష్ట సాధ్యంగా ఉన్నది రాష్ట్రంలో ఉన్న చాలా పంచాయితీలకు విద్యుత్ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి కావున కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత జనాభా ప్రాతిపదికనే ఆర్థిక సంఘం నిధులను పంపవలసిందిగా విజ్ఞప్తి చేశారు