వాహనాల తనిఖీచేపెట్టిన ఎస్ఐ రాజశేఖర్
January 17, 2025
అమరావతి
వాహనదారులు సరైన నిబంధనలను పాటిస్తూ వాహనాలు నడపాలని ఎస్ఐ రాజశేఖర్ కోరారు. సిఐ అచ్చయ్య ఆదేశాల మేరకు గురువారం సాయంకాలం అంబేద్కర్ స్టాచ్ సెంటర్లో వాహనాలు తనిఖీ చేపట్టారు. పండుగ సందర్భంగా బంధుమిత్ర సమేతంగా వచ్చినవారు జాగ్రత్తగా వాహనాలు నలుపుకుంటూ వెళ్ళాలి ఆయన అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. మైనర్ బాలురకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని హెచ్చరించారు. సరైన పత్రాలు కలిగి ఉండి వాహనాలు నడపాలని వాహనదారులకు ఎస్సై చూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదిరులు పాల్గొన్నారు.