75త్యాల్లూరు జడ్పీ హైస్కూలుకు వాటర్ ప్లాంటు వితరణ

పె
దకూరపాడు మండల పరిధిలోని 75త్యాల్లూరు హైస్కూలుకు ఐదు లక్షల రూపాయల వ్యయంతో నూతన మినరల్ వాటర్ ప్లాంటు దాతలద్వారా సమకూరింది
. మంగళగిరి మండలం కాజ గ్రామస్తులు పూర్వ విద్యార్థి ఉమాసుందరి జ్ఞాపకార్థం భర్త సింహాద్రి లీలాప్రసాదరెడ్డి,కుమారులు మనోదిలీప్ రెడ్డి, రాజీవ్ రెడ్డిలు బహుకరించారు. జనవరి 20వతేది సోమవారం రోజున ఉమాసుందరి రెండవ వర్ధంతి సందర్భంగా ప్లాంటు ప్రారంభం చేయనున్నారు. గతంలోనూ ఉమాసుందరి సోదరులు గుత్తికొండ శివసుందర్ రెడ్డి,,జొన్నల శ్రీరామ్ పాపిరెడ్డిలు పాఠశాల అభివృద్ధికి అవసరమైన ఫర్నీచర్,ప్రింటర్,కంప్యూటర్లు,కాఫీ మెషిన్,,నీటి సౌకర్యం కల్పించారు.