ప్రతి నెలా మూడో శనివారం.. 'స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్'
January 17, 2025
ఇకపై ప్రతి నెలా మూడో శనివారం విధిగా 'స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్' కార్యక్రమాన్ని నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. ఈనెల 18న వైఎస్సార్ జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఎక్కడికక్కడ అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. సచివాలయం నుంచి సీఎస్ విజయానంద్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెలకో అంశాన్ని ఎంచుకొని స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టాలని, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖలు ఇందులో ప్రధాన భూమిక పోషించాలని సీఎస్ ఆదేశించారు