గుండె పోటుతో వివాహిత మహిళ మృతి

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వివాహిత మహిళ మృతి చెందిన సంఘటన ఇది సంక్రాంతి పండుగ పురస్కరించుకుని మండల పరిధిలోని 113 తాళ్లూరు గ్రామ పంచాయితీలో పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని మహిళలు ఆటల పోటీలు నిర్వహించారు... గ్రామంలో ఆనవాయితీ గా జరిగే మహిళల ఆటల పోటీలను తిలకించేందుకు వచ్చిన కొండ లక్ష్మి భర్త సాంబిరెడ్డి మహిళలు పోటీపడి చేసుకుని పండగలో చిన్నారులతో కుర్చీల ఆటలో పాల్గొనాలని చూస్తూ ఉండగా మృతురాలు లక్ష్మి అకస్మాత్తుగా కింద పడిపోయింది. దీంతో అప్రమత్తమైన గ్రామ మహిళను లక్ష్మిని కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న స్థానిక ఆర్ఎంపీ వైద్యుని సంప్రదించారు... మెరుగైన వైద్యం కోసం 108 సహాయంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మహిళ మృతి చెందిందని 108 సిబ్బంది నిర్ధారించడంతో మృతదేహాన్ని గ్రామస్తులు స్వగ్రామమైన 113 తాళ్లూరు చేర్చారు.. సమాచారం అందుకున్న గ్రామ రెవెన్యూ అధికారులు మృతురాలి మరణం పై దర్యాప్తు చేపట్టి నివేదికను సమర్పిస్తామన్నారు.. మృతురాలికి భర్త ముగ్గురు పిల్లలు సంతానం కలదు..