అనుమతులు లేకుండా కోడిపందాల ఆటకు సన్నాహాలు. అమరావతి
January 11, 2025
మండలం పరిధిలోని లేమల్లె గ్రామ శివారులో అనుమతులు లేకుండా కోడిపందాల ఏర్పాటుకు సన్నహాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు తెలిపారు. ఎస్పీ ఆదేశాలు భేఖాతరు చేస్తూ స్థానిక నేతలు పందాలు నిర్వహించేందుకు భారీ గేట్లు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు కానీ పోలీసు యంత్రాంగం గాని అటువైపు కన్నెత్తి చూడలేదని ప్రజలన్నారు. పండుగ సరదా వాతావరణం లో జరుపుకోవాలని కోడిపందాలు నిర్వహిస్తూ కత్తి కట్టి వాటి ప్రాణాలు తీసేలా ఆటలు ఆడరాదని జంతు ప్రేమికులు అన్నారు. ఈ విషయమై అధికారులు స్పందించాలని స్థానిక ప్రజలు కోరారు