గోకులం షెడ్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే.. క్రోసూరు

మండలం అందుకూరులో గోకులం షెడ్డులను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శనివారం ప్రారంభించారు. పాడి రైతుల అభివృద్ధి కోసం 90 శాతం సబ్సిడీతో గోకులం పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. పాడి రైతుల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్న ఎమ్మెల్యే అన్నారు.గోకులం పథకం ద్వారా పాడి పరిశ్రమను ప్రోత్సహించడం,పాడి రైతులకు ఆర్ధికంగా సాయం అందించడం పశువుల ఆరోగ్య సంరక్షణ,పాల ఉత్పత్తిని పెంచడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.గోకులం పథకాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్ధికంగా అభివృద్ధి చెందాలన్న ఎమ్మెల్యే కోరారు.