సందడి సందడిగా సాగిన సంక్రాంతి సంబరాలు.
January 15, 2025
పెదకూరపాడు బెంజ్ న్యూస్
బోగితో ప్రారంభమై ...సంక్రాంతితో సందడి చేసి, కనుముతో గుడ్ బాయ్ చెప్పిన సంక్రాంతి పండుగను మండల ప్రజలు ఆనందంగా సంతోషంగా జరుపుకున్నారు.రైతులు పండిన పంట ఇంటికి చేరిన సమయంలో వచ్చే తొలి పండుగ సంక్రాంతి పండుగ కావడంతో ప్రతి ఊరిలో పిల్లా పాపలతో గొవు గోధతో ఆనందంగా కలిసి చేసుకునే పండుగ సంక్రాంతి పండుగ. ప్రతి కుటుంబ సమేతంగా బంధుమిత్రుల సమేతంగా కొత్త అల్లుళ్లతో, కొత్త కొత్త రుచులతో వడ్డించిపెట్టే పండుగ సంక్రాంతి పండుగ. ...పండుగ వాతావరణం గ్రామాల్లో సరదా సరదాగా సాగింది. యువత కోడి పందాలు, గాలిపటాలు ఎగరవేయడం, పంచ కట్టు కట్టి పొలం గట్లపై నడిచి వెళ్ళడం నేతి యువత కూడా ట్రెండు గా ఫాలో అవుతూ సంక్రాంతి సంబరాన్ని పండుగలా జరుపుకున్నారు.