మాలల మీద దాడిని మతాల మీద దాడిని ఖండించిన
January 15, 2025
రిటైర్డ్ ఐఆర్ఎస్ జేఏసీ చైర్మన్ పసుపులేటి దేవి ప్రసాద్
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం
మండల పరిధిలోని పొనుగుపాడు లో ఈనెల 11న ఆర్.సి.యం దేవాలయంలో అధికార ప్రభుత్వంలో అహంకారంతో క్రైస్తవుల స్థలాలపై కన్నేసి అధికార పార్టీ నాయకులు 1903 బ్రిటిష్ కాలం నాటి చరిత్ర కలిగిన క్రైస్తవుల దేవాలయ స్థలాన్ని ఆక్రమించి ఆ మార్గంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఉన్న పాటున క్రైస్తవులు కట్టుకున్న గోడను కూల్చి, పోలీసుల అండతో క్రైస్తవు మహిళలను, భయభ్రాంతులకు గురిచేస్తూ మూడు కుటుంబాల అవసరాల కోసం అక్రమంగా క్రైస్తవుల స్థలాన్ని ఆక్రమించి రోడ్డు నిర్మించారు..
ఈ విధానంపై దళితుల మనోభావాలు దెబ్బతినేలా అగ్రకులాలు అహంతో వ్యవహరించిన అధికార పార్టీ కుతంత్రాన్ని కుల సంఘాలు ఖండించాయి...
కార్యక్రమానికి హాజరైన మాల మహానాడు రాష్ట్ర నాయకులు గోదా జాన్ పాల్ బుధవారం గ్రామంలో దళితులకు జరిగిన అన్యాయం పై మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరించిన అధికార పార్టీ నాయకులు అగ్రకులానికి చెందిన కొందరు కొమ్ముకాసి దాడులకు పోలీసుల వైఖరిని కుల సంఘాల నాయకులు ఖండించారు...
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవహేళన చేసేలా క్రైస్తవుల పై జరిగే దాడులను పోలీసులు ఖండించాల్సింది పోయి అధికార పార్టీకి నాయకు లు దళితులపై వ్యవహరించిన విధానం అపహాస్యంగా ఉందన్నారు..
అక్రమంగా దారి వేసి క్రైస్తవుల స్థలాలలో ఉన్న గోడలను కూల్చి అక్రమంగా రోడ్డు కుల సంఘాలు తప్పు పట్టాయి .
ప్రజాక్షేత్రములు న్యాయ ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోయారు అన్నారు చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు క్రైస్తవులకు మద్దతుగా పోరాటం చేసి క్రైస్తవుల ఆస్తులను కాపాడుకుంటామన్నారు.