డ్రోన్లు సాయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు -సిఐ అమరావతి బెంజ్ న్యూస్

పల్నాడు జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టామని ,చోరీలను నివారించేందుకు ప్రత్యేక నిఘా గస్తి చేపట్టామని అమరావతి సీఐ అచ్చయ్య అన్నారు. గత రెండు రోజుల క్రితం దాచేపల్లి, గురజాల పరిసర ప్రాంతాల్లో జరిగిన చోరీలను దృష్టిలో పెట్టుకుని పల్నాడు ఎస్పీ ఆదేశాల మేరకు అమరావతి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక గస్తి నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనుమానంగా సంచరిస్తే తమకు తెలపాలని ఆయన కోరారు. అపరిచితులను నమ్మరాదని ఆయన అన్నారు. రాత్రి వేళల్లో డ్రోన్లు ఏర్పాటు చేశామని సాయంతో ప్రత్యేక సిసి పుటేజులు తెప్పించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గుర్తుతెలియని కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసు వారికి తెలియజేయాలని అచ్చయ్య కోరారు.