పెదకూరపాడు మండల పరిధిలో జోరుగా అక్రమ రేషన్ వ్యాపారం

 


      బెంజ్ న్యూస్.పెదకూరపాడు పల్నాటి ప్రభ ప్రతినిధి ఆగస్టు 5

పల్నాడు జిల్లా పెదకూరపాడు మండల పరిధిలో రేషన్ డీలర్ల సహాయంతో అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. మండల పరిధిలో గుంటూరు కీ చెందిన ఓ దళారీ ఆధ్వర్యంలో రేషన్ డీలర్ల వద్ద రాత్రి వేళలో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని ఒక మిల్లు కు తరలిస్తున్నట్లుగా సమాచారం. నియోజకవర్గంలో ఐదు మండలాలకు  ఒక్కొక్క మనిషిని తన మనుషులుగా పెట్టుకొని వ్యాపారం కొనసాగిస్తు న్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా పేదవాడికి అందవలసిన రేషన్ బియ్యాన్ని అడ్డగోలుగా కొనుగోలు చేస్తూ లక్షల రూపాయలు గడుస్తున్న  గుంటూరు దళారిపై  చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.