సత్తెనపల్లి : బెంజ్ న్యూస్
సత్తెనపల్లి పట్టణంలో లోని అచ్చంపేట రోడ్ లో గల గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో బుక్స్ మరియు బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ
మన ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావొస్తుంది, ప్రజల అవసరాలను తీరుస్తాం అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం సంతోషం అని,ప్రజలు కూడా అత్యధిక మెజారిటీ తో గెలిపించారు.మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం కల వ్యక్తి,14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా చేసిన వ్యక్తిఅని, ఆయన నాయకత్వంలో మన పక్కనే ఉన్న మన రాజధాని అమరావతి అభివృద్ధి తో పాటు, రాష్ట్ర అభివృద్ధి కూడా త్వరితగతిన జరుగుతుంది మనం చూడబోతున్నాము, అలాగే విద్యా, వైద్య, అభివృద్ధి,సంక్షేమం పరంగా ఈ ప్రభుత్వం ప్రజలు ఆశించిన విధంగా ఉంటుంది అని దానికి నిదర్శనం ఇవాళ ఈ కాలేజ్ లో పుస్తకాల పంపిణీ కానీ, కాలేజీ లో ఆగిపోయిన అభివృద్ధి పనులు కానీ ఖచ్చితంగా పూర్తి చేస్తాం అని, విద్యార్థులు అందరూ బాగా చదువుకొని ఉజ్వల భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.