పిడుగురాళ్ల : బెంజ్ న్యూస్ పిడుగురాళ్ల బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా కే.కుమార స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా 2024-25 ఏడాదికి సంబంధించి పిడుగురాళ్ల బార్ అసోసియేషన్ ఎన్నికలను మంగళవారం నిర్వహించి కార్యనిర్వాహక వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా కే.కుమార స్వామి, ఉపాధ్యక్షురాలుగా పి.భవాని వి.యస్, సెక్రటరీగా కే.వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీగా పి.మాణిక్యం, ట్రెజరర్ గా ఎం.లోకేశ్వరి, లైబ్ర రియన్ గా ఎస్.వి కోటేశ్వరరావు, లేడీస్ రిప్రజెంటటివ్ గా పి.నవ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను ప్రముఖ క్రిమినల్, సీనియర్ న్యాయవాది దారా చెన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. నూతన కార్యవర్గాన్ని పిడుగురాళ్ల సీనియర్ న్యాయవాదులు రెడ్డి సాంబశివరావు, కే. కాశీ విశ్వనాధం, యు.కోటేశ్వరరావు, పి.మరియన్న, ఎ.రూత్ బనియన్, కే. జాలారావు లు అభినందించారు. అలాగే కొత్త కార్యవర్గాన్ని పలువురు పట్టణ, పుర:ప్రముఖులు అభినందించారు.