అమరావతి పెదకూరపాడు:- బెంజ్ న్యూస్ మండలంలోని మల్లాది వైకుంటపురం ధరణికోట గ్రామాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందనిగతఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. ప్రభుత్వంలో జీ.సి.కె.సి పేరుతో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి ఇసుక నిల్వలు చేశారు. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించటంతో అధికార పార్టీకి చెందిన నాయకులు ఇసుక అక్రమార్కులు కలిసి చీకటి పడితే స్టాక్ పాయింట్ నుండి భారీగా ఇసుకను తరలిస్తున్నారు.ఈ విషయంలో పెదకూరపాడు పోలీసులు అమరావతి పోలీసులుమౌనం పాటిస్తున్నారనిస్థానిక ప్రజలు తెలిపారు.అక్రమా ఇసుక రవాణాలను అరికట్టడంలో పోలీసు యంత్రాంగంపూర్తిగా విఫలమైందని ఆయా మండలాల ప్రజలు తెలిపారు.ఉన్నత అధికారులు సైతంఇలాంటి స్పందన లేకపోవడం వడ్డూరంగా ఉందనిస్థానిక ప్రజలు తెలిపారు.ఆరోపణ ఉన్నప్పుడు కనీసంపరిశీలన చేసిసంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతధికారులు నిమ్మకు నిలిచినట్లు వ్యవహరించడంపై పలు విమర్శలు వెలివెత్తుతున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ శాఖ పోలీస్ శాఖమరణించకస్పెషల్ ఎన్ఫోర్మేంట్ బ్యూరో శాఖ రోడ్డు రవాణా శాఖ అధికారులు కళ్లు తెరవాలని ఆయా గ్రామాల మండల ప్రజలు కోరారు.