చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉప ఆలయంగా ఉన్న షణ్ముఖ రూపంలో ఉన్నటువంటి శ్రీ కుమార స్వామి వారికి మంగళవారం విశేషంగా పంచామృత అభిషేకాలు దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించినట్లు దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వేమూరి గోపీ తెలిపారు. ఆషాఢ మాసంలోని కృత్తిక నక్షత్రంతో కూడిన మంగళవారం విశేషంగా పంచామృత అభిషేకాలు నిర్వహించారు. దేవస్థానం అర్చక స్వాములు శంకరమంచి రాజశేఖర్ శర్మ మరియు రాజేష్ శర్మ పంచామృత అభిషేకాలను నిర్వహించారు. అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదములు వినియోగించారు.