గౌరవ పాత్రికేయులకు నమస్కారం సార్ *దిల్లీ, తేది 30-07-24

 


యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ  46వ  సమావేశంలో నిన్న, ఈరోజు పాల్గొన్న అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులుభారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చారిత్రక  కట్టడాలు, స్మారకాలు  చరిత్ర అపూర్వంయునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క కొనసాగుతున్న 46వ సెషన్‌లో అస్సాంలోని రాచరికపు శ్మశానవాటిక అయిన మొయిదమ్స్‌ను భారతదేశంలో 43వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా చేర్చినట్లు ప్రకటించడం గర్వకారణమైన క్షణం.  జూలై 21 నుండి 31 వరకు భారత్ మండపంలో   కేంద్ర పురావస్తు శాఖ సెషన్‌ను నిర్వహిస్తోంది మరియు 165 దేశాల నుండి సుమారు 3000 మంది ప్రతినిధులు హాజరయినారు జులై 21న ప్రధాని  శ్రీ నరేంద్ర మోడీ   ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా  గండికోట,అమరావతి, నాగార్జునకొండ, సాలిహుండం, శంకరం ని గుర్తించాలి  శిల్పకళకు, వర్ణచిత్రాలకు నిలయమైన లేపాక్షి ని యునెస్కో ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ కట్టడంగా శాశ్వత జాబితాలో చోటు దక్కే విధంగా కృషి చేయాలనీ, లేపాక్షి కి గతంలోనే తాత్కాలిక జాబితాలో చేర్చినా ఫైనల్ జాబితాలో చోటు దక్కాలంటే కొన్ని సమస్యలను అధికమించాలి యునెస్కో నియమ నిబంధన ప్రకారం తయారుచేసి సిఫారసు చేయాలని   అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్  మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ (దిల్లీ)జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాoజనేయులు  భారత మండపంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన 29,30 తేదీల్లో పాల్గొనారు అని తెలిపారు. *యునెస్కో సభ్యదేశాలు,తమ దేశాలకు చెందిన పురాతన స్థలాలు, కట్టడాలు, సుందరతర ప్రకృతిప్రదేశాలకు ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు కోసం పంపే ప్రతిపాదనలను ఈ సమావేశాల్లో చర్చించి, అప్పటికే తాత్కాలిక జాబితాలోచోటు దక్కించుకొన్న వాటిపై ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని, ఆసక్తికరంగా సాగే చర్చల ద్వారా, కొత్త ప్రతిపాదనల నివేదికల తయారీకి అవసరమైననెపుణ్యాన్ని సంతరించుకొనే వీలు చిక్కిందని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి  ఒక ప్రకటనలో   విజ్ఞప్తి చేసారు .ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రo లోని 129 కట్టడా లలో ఒక్క దానిని కూడా యునెస్కో ఫైనల్ జాబితాలో చోటు లేఖ పోవటం శోచనీయమన్నారు.   ఆంధ్రప్రదేశ్ లోని అపురూప చారిత్రక కట్టడాలు కు యునెస్కో లో చోటు లేక పొతే ఆంధ్రప్రదేశ్ పర్యటకంగా వెనుకబడి పోతుందని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు  ఆవేదన వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ చారిత్రక కట్టడాలు, స్మారకాలు గొప్ప సంసృతికి, చరిత్ర కు నిలయాలు అని తెలిపారు 



 


ఎన్నో ఏళ్ళుగా (లేపాక్షి కి యునెస్కో తాత్కాలిక జాబితాలో మాత్రమే చోటు దక్కింది )గండికోట, నాగార్జున కొండ, శాలిహుండం, అమరావతి  శంకరం ను  ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తించక పోవడం బాధాకరం అన్నారు.


కనీసం ఇప్పుడైన పురావస్తు శాఖావారు ప్రపంచంలోనే పెద్దదైన ఏకశిలా నంది విగ్రహం, అతిపెద్ద ఏడు పడగల నాగేంద్రుడు, 856 స్థూపాల ఆలయం, 12 ధ్వజ స్తంభాలతో కూడిన నాట్యం మండపం, ఏ ఆధారం లేకుండా వేలడే ధ్వజస్తంభం, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విలువైన శిల్పకళ, కుడ్య చిత్రాలకు నిలయమైన" లేపాక్షి "ని ప్రపంచ వారసత్వ కట్టడంగా శాశ్వతం గా (యూనె స్కో )గుర్తించేందుకు కృషి చేయాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి 2025 లోనైనా యునెస్కో  ఫైనల్ జాబితాలోకి లేపాక్షి  ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు యునెస్కో తాత్కాలిక జాబితాలోకి ఎంతో ఘన చరిత్ర ఉన్న అమరావతి, నాగార్జునకొండ, గండికోట(కడప )సాలిహుండం(శ్రీకాకుళం )శంకరం (అనకాపల్లి )ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో ని ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాలు భారత మండపంలో జరుగుతున్న సందర్భంగా  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

 తెలుగు రాష్ట్రాల నుంచి అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, స్తపతి ప్లీచ్ ఇండియా సీఈవో    డా. ఈమని శివనాగిరెడ్డి,  .మధుసూదన్, కన్వీనర్, INTACH, బెంగళూరు 3. డా. మనీషా, జార్ఖండ్ టూరిజం,  తదితరులు పాల్గొన్నారుఇట్లుడాక్టర్ జాస్తి వీరాంజనేయులుచైర్మన్,అమరావతి అభివృద్ధి కమిటీ మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు