సత్తెనపల్లి : బెంజ్ న్యూస్
దళిత, గిరిజన, మైనార్టీ వర్గాల నిరుద్యోగ యువతీ, యువకులకు హాస్టల్ తో కూడిన ఉచిత శిక్షణ కల్పించాలి. జొన్నలగడ్డ విజయ్ కుమార్, న్యాయవాది, జైభీమ్ రావ్ భారత్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు డిమాండ్.రాష్ట్రంలో డాక్టర్.బిఆర్.అంబేడ్కర్ స్టడీ సర్కిల్స్ ను మళ్లీ పునరుద్ధరించి డీఎస్సీ కి బహుజన నిరుద్యోగ యువతీ, యువకులకు వసతితో కూడిన ఉచిత శిక్షణ ఇవ్వాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) పల్నాడు జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ కోరారు. సత్తెనపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా డీఎస్సీ నిర్వహిస్తుం డటంతో దళిత, గిరిజన, మైనార్టీ తదితర వర్గాలకు చెందిన వారు ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పోటీ పరీక్షలకు సన్నద్ధం కాలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పోటీ పరీక్షలకు ఇదేవిధంగా వసతితో కూడిన శిక్షణ ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు కూడా ప్రతి జిల్లా లో అంబేడ్కర్, జ్యోతి బా పూలే శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించాలని అయన కోరారు. ప్రతీ సంవత్సరం శిక్షణ క్యాలెండర్ ఇవ్వటంతో పాటు నిరుద్యోగులలో నాణ్యత ప్రమాణాలు పెరిగేలా ఉత్తమ ఉపాధ్యాయులనునియమించాలని సూచించారు. ప్రతి జిల్లాలో స్టడీ సర్కిల్స్ కి శాశ్వత భవనాలతో పాటు, హాస్టల్స్, లైబ్రరీ ఏర్పాటు చెయ్యాలని చెప్పారు. ఆయా విషయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శాసనసభ్యులు, మంత్రులు, అధికారులు స్పందించి వెంటనే ఏర్పాటు అయ్యేలా చూడాలని ఆయన అభ్యర్థించారు.