ఏపీ లో ఈనెల 16న సీఎం చంద్రబాబు కేబినెట్‌ సమావేశం

 


అమరావతి : బెంజ్ న్యూస్


ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్‌లోని ఫస్ట్ బ్లాక్‌లో రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌ సమావేశంలో చర్చించే అంశాలను ఈ నెల 11న సాయంత్రం 4 గంటల లోపు శాఖలవారీగా అందజేయాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా ఇతర మంత్రులు పాల్గొన్నారు.