మేయర్ కావటి మనోహర్ నాయుడుకి చిత్తశుద్ధి ఉంటె వైసీపీకి, మేయర్ పదవికి రాజీనామా చేయాలి - గళ్ళా మాధవి

 


    బెంజ్ న్యూస్.గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్  వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి మాట్లాడటం చూస్తే  హాస్యాస్పదంగా ఉంది.  

కౌరవ సభలో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని కించపరిచే విధముగా తన తోటి నాయకుడైన వల్లభనేని వంశీ కౌరవ సభలో చేసిన వ్యాఖ్యలు 5ఏళ్ళ తరువాత మేయర్ కు  గుర్తుకు రావడంపై  దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు.  ఎందుకు అంటే ఆ కౌరవుల జట్టులోనే కావటి మనోహర్ నాయుడు ఉన్నారు. దీనికి 2024 చిలకలూరిపేటలో పోటీచేసి ఇప్పుడు ఇది తప్పు అని చెప్పటం నీచ రాజకీయాలకు నిదర్శనం   . వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను ఆయన నిజంగా మనస్ఫూర్తిగా తప్పు పడితే, వైసిపి పార్టీకి రాజీనామా చేసి ఆయన నిబద్ధత నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.నగర మేయర్ టీడీపీ డివిజన్లలో రోడ్లు వేయనీకుండా అడ్డుకొన్నారని, మొన్నటి వరకు టీడీపీ నేతలు  కనీసం ఫ్లెక్సీ కూడా కట్టుకోలేని పరిస్థితి కల్పించారని ధ్వజమెత్తారు