పెదకూరపాడు బెంజ్ న్యూస్
మండల పరిధిలోని75 తాళ్లూరు గ్రామంలో గీతా మందిరంలో సోమవారం గాయత్రీ మాత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గాయత్రి మాత ఉపాసకులు ఆధ్యాత్మిక గురువులు అంకారావు మాస్టారు పాల్గొని గాయత్రి మాత చిత్రపటాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గాయత్రి హోమం నిర్వహించి గాయత్రి మాత విశిష్టత సత్సంగం ఏర్పాటు చేశారు వారు మాట్లాడుతూ చిన్ననాటి నుండి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని గురువుని గౌరవించాలని సేవాభావంతో కలిగి ఉండాలని ఎదుటివారి బాధను మన బాధగా తీసుకునే విధంగా గురుని ఆజ్ఞతో సేవా కార్యక్రమాలు చేయాలని వారన్నారు అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదంగా పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు ఆధ్యాత్మిక గురువులు కాశిపాడు జలాలపురం తాళ్లూరు అబ్బరాజుపాలెం గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు