ఈపూరు బెంజ్ న్యూస్
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఉపాధ్యాయ పక్షపాతి,రాష్ట్ర నోబెల్ టీచర్స్ ప్రముఖ నాయకులు బెజవాడ నాగేశ్వరరావును శుక్రవారం ప్రాథమికోన్నత పాఠశాల అగ్నిగుండాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయనకు పూలబొకేలు,మెమెంటోలు అందజేసి దుశ్శాలవాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గొడుగు ప్రతాప్ మాట్లాతూ నాగేశ్వరరావు ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ ఉపాధ్యాయ సమస్యలకు తన వంతు కృషి చేశారని నాగేశ్వరరావును కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగినేని రామారావు,తావూరియా నాయక్,శైలజ,సుభాని,తులసి,రామకోటేశ్వరావు తదితరులు ఉన్నారు.