ఆపదంటే చాలు క్షణంలో వాలిపోతాడు బుజ్జి

 


పెదకూరపాడు బెంజ్ న్యూస్ 

 సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న పేద విద్యార్థికి బుజ్జి ఆర్థిక సహాయం, సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న పేద విద్యార్థులకు పల్నాడు జిల్లా పెదకూరపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, నెలకుదుటి వీర వెంకట వర ప్రసాద్ బుజ్జి గత నాలుగు సంవత్సరాలు నుండి తన మిత్ర బృందంతో ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఆపద అంటే చాలు క్షణాల్లో వాలిపోతాడు బుజ్జి ,సమాజం త్వరితగతిన అభివృద్ధి చెందాలంటే అది ఉన్నత చదువులతోనే సాధ్యమని నమ్మిన వ్యక్తి నెలకుదుటి , మొదటి నుండి ఉత్సాహంతో ఉన్నతి విద్యా చదవాలనుకునే పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తూ వారి ఉన్నతికి తోడ్పాటు అందిస్తున్నారు బుజ్జి శుక్రవారం పెద్దకూరపాడు గ్రామానికి చెందిన ముస్లిం మైనార్టీ సోదరుడు షేక్ ఇమ్రాన్ (తండ్రి) యూసుఫ్ పేద విద్యార్థికి సివిల్ ప్రిపేర్ అవుతుంటే గత నాలుగు సంవత్సరాల నుండి బుజ్జి మిత్ర బృందంతో సహాయం అందజేయటమే కాకుండా ఇటీవల బుజ్జి సూచన మేరకు ప్రముఖ రాష్ట్ర పేదల ఆర్థిక స్వచ్ఛంద సేవా సంస్థ మాగులూరి ఫౌండేషన్ అధినేత ఎన్నారై భాను 15000 బుజ్జి చేతుల మీదుగా ఈ సాయాన్ని విద్యార్థికి అందించారు ఈ సందర్భంగా విద్యార్థి షేక్ ఇమ్రాన్ మాట్లాడుతూ పేదల ఆరాధ్య దైవం బుజ్జన్న అని కొనియాడారు బుజ్జన్న తన స్నేహితులతో ఆర్థిక తోడ్పాటు అందించడమే కాక , భాను ప్రకాష్ ద్వారా అందించిన సాయం మరవలేనని అన్నారు ఈ కార్యక్రమంలో పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులు చెరుకూరి శంకర్ ఉన్నారు