వైభవంగా పోలేరమ్మ దేవస్థానం 12 వ వార్షికోత్సవ వేడుకలు...

 


రెంటచింతల బెంజ్ న్యూస్ 

పలనాటి కోనసీమగా పేరు పొందిన మండలంలోని మంచికల్లు గ్రామంలో వేంచేసిన పోలేరమ్మ దేవస్థానం 12 వ వార్షికోత్సవ వేడుకలను గురువారం భక్తిశ్రద్ధలతో ఎంతో వైభవంగా నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు కారంపూడి వెంకటాచార్యులు నేతృత్వంలో ఉదయం 5 గం. నుంచి సుప్రభాతం, పంచామృతాభిషేకం, వివిధ రకాల ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. మధ్యాహ్నం 12 గం. ఈ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొని పోలేరమ్మ అమ్మవారి ఆశీస్సులు పొందిన వేలాదిమంది భక్తులకు మహా అన్నదానం చేపట్టారు. సాయంత్రం 6 గం. నుంచి ప్రత్యేకంగా అలంకరించిన రథం పై అమ్మవారి ఉత్సవ విగ్రహంతో మేళతాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. దేవస్థానాన్ని రంగు రంగుల విద్యుత్ తోరణాలతో అందంగా అలంకరించారు.