చిలుకలూరి పేటలో ఉగాది వేడుకలు
March 30, 2025
లోక్ సత్తా పోరాటంతో నిర్మించిన బ్రిడ్జిని సందర్శించిన నాయకులు.
చిలుకలూరి పేటలో ఉగాది వేడుకలు
చిలుకలూరి పేట,
ఓగేరు వాగు పై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని ఆదివారం లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, న్యాయవాది మాదాసు భాను ప్రసాద్, 2024 సార్వత్రిక ఎన్నికల్లో సత్తెనపల్లి ఎమ్మెల్యే గా పోటీ చేసిన అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ సందర్శించారు. పసుమర్రు గ్రామ రెవిన్యూ పరిధిలో పంట పొలాలను సాగు చేసుకుంటున్న సన్న, చిన్నకారు రైతులు బ్రిడ్జి లేక ఈ మార్గంలో రాకపోకు సాగించేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా నివాస స్థలాలు ఉన్నప్పటికీ శాశ్వత గృహ నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో దశాబ్దాల కాలంగా నెలకొన్న ఈ సమస్యను లోక్ సత్తా పార్టీ నాయకుడు మాదాసు భాను ప్రసాద్ ప్రజలు, రైతుల భాగస్వామ్యంతో 2014 నుంచి 2019 వరకు పోరాటాలు చేశారు. దింతో ప్రభుత్వం స్పందించి సుమారు రూ.9 కోట్ల తో బ్రిడ్జిని నిర్మించారు. త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది. అందరి భాగస్వామ్యంతో ఈ బ్రిడ్జిని సాధించుకున్నాం.. ఈ ప్రాంతంలో రియల్ భూమ్, పరిశ్రమలతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. తమకు సహకరించిన ప్రజలు, రైతులు, అధికారులు ప్రభుత్వానికి ధన్యవాదములని మాదాసు భాను ప్రసాద్ తెలిపారు.
చిలుకలూరి పేటలో ఉగాది వేడుకలు*
ఉగాది పండగ సందర్బంగా స్థానిక వెంకట రెడ్డి గృహం వద్ద పండుగ వేడుకల్లో మాదాసు భాను ప్రసాద్, జొన్నలగడ్డ విజయ్ కుమార్ , పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉగాది పచ్చడి, ప్రసాదం తిని వారు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.