డాక్టర్ జాస్తి వీరాంజనేయులు కి ముఖ్యమంత్రి ఉగాది పురస్కారం అందజేత

ఖిల భారత పం చాయితీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ప్రతిష్టాత్మకమైన ఉగాది పురస్కారాన్ని అందు కున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. గత కొన్నేళ్లుగా జాస్తి చేస్తున్న సామాజిక సేవను గుర్తించి ఏపీ ప్రభుత్వం ఆయనను సన్మానించి కృష్ణవేణి తల్లి షీల్డును బహుకరించింది. గతంలో 2017 వ సంవత్సరంలో కూడా ఉగాది పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వ శ్రమశక్తి అవార్డు, ముఖ్యమంత్రి నుంచి అందుకున్నారు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్,ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ఏవి రాజమౌళి ఎమ్మెల్యేలు, చైర్మన్లు ఉన్నారు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు శ్రీ విశ్వా వసు ఉగాది పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపి శ్రీ వెంకటేశ్వర స్వామి షీల్డ్ ని బహూకరించారు ప
ల్నాడు జిల్లా అమరావతి మండల పరిధిలోని పెద మద్దూరు గ్రామానికి చెందిన డాక్టర్ జాస్తి వీరాంజనేయులుకు ఉగాది పర్వదినం నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్టాత్మకమైన ఉగాది పురస్కారం లభించటంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌ తుంది. అఖిల భారత పంచాయతీ పరిషత్ (దిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులుగా, అమరావతి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారుగా,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉమ్మడి గుంటూరు బ్రాంచ్ పాట్రన్ గా సామాజిక సేవారంగంలో ఉన్నతమైన సేవలను అందిస్తూ అమరావతి ప్రాంత అభివృద్ధికి తోడ్పా టు నందిస్తూ ఇతర దేశాల్లో కూడా అమరావతి గురించి ప్రచారాన్ని నిర్వహించారు రాష్ట్రస్థాయి మరియు జాతీయస్థాయిలో గ్రామపంచాయతీలు స్థానిక సంస్థల బలేపేతం అయ్యేవిధంగా స్థానిక సంస్థలకు నిధులు విధులు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపారు అనేక రాష్ట్రాల్లో పర్యటించారు సర్పంచులను చైతన్య పరిచారు దిల్లీ కి అనేక పర్యాయములు వెళ్లి ఆంధ్రప్రదేశ్ లో నూతన కేంద్ర పురావస్తు శాఖ అమరావతి సర్కిల్ కార్యాలయం ఏర్పాటు కోసం ఆ శాఖ కేంద్ర మంత్రులను కార్యదర్శులను అధికారులను వ్యక్తిగతంగా కలిసి కృషి చేశారు, రాజధాని అమరావతి లోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండాలని కేంద్ర ప్రభుత్వంతో ప్రధాని కార్యాలయంతో లేఖల ద్వారా సంప్రదింపులు జరిపారు అనేక సాంస్కృతిక సంస్థల కార్యక్రమాలకు హాజరవుతూ కళాకారులను ప్రోత్సహిస్తున్నారు దేశ విదేశాల్లో ఉన్న అమరావతి బౌద్ధ శిల్ప సంపదను తిరిగి అమరావతికి తీసుకువచ్చే దానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు రాష్ట్రంలో ఎన్నో చారిత్రక ప్రాంతాల అభివృద్ధి కోసం లేపాక్షి,గండికోట అమరావతి,శాలిగుండం, శంకరం, గుంటుపల్లి, నాగార్జునకొండ తదితర చారిత్రక ప్రాంతాలకు యునెస్కో గుర్తింపు కోసం ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తున్న వీరాంజనేయులుకు ఉగాది పురస్కారం లభించటంపై పెదమద్దూరు గ్రామస్తులు, పలువు రురాజకీయనేతలు,సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు గతంలో కూడా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి అవార్డులు అందుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజ నేయులు మాట్లాడుతూ భవిష్యత్లో కూడా తన వంతుగా రాష్ట్ర జాతీయ స్థాయిలో సామాజిక సేవ కొనసాగిస్తానని తెలిపారు ఇంత ప్రతిష్టాత్మకమైన అవార్డుకు నేను చేసిన సేవలను గుర్తించి ఎంపిక చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అవార్డు ఎంపిక కమిటీ చైర్మన్, అవనిగడ్డ శాసనసభ్యులు రాష్ట్ర ఎథిక్స్ కమిటీ చైర్మన్ మాజీ మంత్రివర్యులు మండలి బుద్ధ ప్రసాద్, రాష్ట్ర చైర్మన్ లు పొడపాటి తేజస్విని, గుమ్మడి గోపాలకృష్ణ ఇతర కమిటీ సభ్యులకు, సీఈఓ ఆర్ మల్లికార్జున రావు కు కృతజ్ఞతలు తెలిపారు