31 తో టెండర్ కాలం పూర్తి-- అధికారుల చర్యలు శూన్యం
March 19, 2025
పెదకూరపాడు (అమరావతి)
టెండర్ల కాలం పూర్తయ్య సమయం ఆసన్నమైనప్పటికీ అనుమతులు లేని చోట పడవ ప్రయాణం కొనసాగుతూనే ఉందని స్థానిక ప్రజలు తెలిపారు. మండల పరిధిలోని ధరణికోట పరిసర ప్రాంతాల్లో పడవ తిప్పుకునేందుకు జడ్పీలో 76 వేలకు టెండర్ పాడి, నేడు అందుకు విరుద్ధంగా పాఠ దారున్ని పక్కనపెట్టి అమరావతి నుంచి చెవిటికలు వైపుకు అనుమతులు లేకుండా పడవ ప్రయాణం సాగిస్తున్నారని ప్రజలన్నారు. ఎంపీడీవో తాసిల్దారు సిఐలు పరిశీలించినప్పటికీ చర్యలు శూన్యమని మార్చి 31 తో టెండర్ కూడా పూర్తవుతుందని వారన్నారు. అనుమతులు లేకుండా లైసెన్స్ లేకుండా సరైన ప్రదేశంలో కాకుండా పడవ తిప్పే వారిపై చర్యలు తీసుకోలేని అధికారులపై ఉన్నత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజల కోరారు.