ప్రచురణార్థం 24-03-2025 - తాడేపల్లి -- రాష్ట్రంలో ఉన్న సర్పంచ్ ల సమస్యలను పరిష్కరించండి.

15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాల్సిందిగా మరియు కేంద్రం నుంచి రావాల్సిన MGNREGS మ్యాచింగ్ గ్రాంట్ నిధులను కూడా రప్పించాల్సిందిగా కోరుతూ
తాడేపల్లి లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రాష్ట్ర అదనపు కమిషనర్ M. సుధాకర్ రావు మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ M.శివప్రసాద్ లను కలిసిన ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కమిషనర్ చైర్మన్ చిలకలపూడి పాపారావు మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ ( న్యూఢిల్లీ ) జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు. ఈ సందర్భంగా అపరిష్కారంగా ఉన్న సర్పంచ్ల గౌరవ వేతనాలు మరియు గ్రామాల్లో సర్పంచ్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతో, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ తో చర్చించి మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు మరియు 15 వ ఆర్థిక సంఘం నిధులు కూడా త్వరలో విడుదల అయ్యేలా చూస్తామని తెలియజేశారు. సర్పంచులు ఎంపీపీలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్ ల గౌరవ వేతనముల పెంపు ఉపముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ తో చర్చించి కమీషనర్ నిర్ణయం తీసుకుంటారు అని తెలిపారు