నదిలో మనిషి గల్లంతు.

అచ్చంపేట:
కృష్ణానది వద్ద స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు మేరకు అచ్చంపేట మండలం పుట్లగూడెం గ్రామానికి చెందిన మర్రి గోవిందు రెండో కుమారుడు మర్రి రామయ్య లక్ష్మీ తిరుపతమ్మ మాలవేసి నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయాడు. కుటుంబ సభ్యుల స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా పోలీసులు గాలించారు. అతని ఆచూకీ కొరకు చేపలు పట్టే పడవ ద్వారా గాలించుగా రాత్రి సుమారు 7 గంటల 40 నిమిషాలకు రామయ్య మృతదేహాన్ని వెలికి తీసినట్లు తెలిపారు. మర్రి గోవిందు ఇచ్చిన ఫిర్యాదును కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు