సిండికేట్ పేరుతో దోచుకుంటున్నారు.
January 19, 2025
ఇష్టారాజ్యంగా గల్లీల్లో బెల్టుల లొల్లి..
సిండికేట్ పేరుతో 20 రూపాయలు అక్రమ వసూలు.
బెల్టు నిర్వహణ వద్ద నుండి 50 వేలు వసూలు..
అన్నిటికీ మేమున్నాం అక్రమంగా సంపాదించుకో అంటున్న సిండికేట్
పెదకూరపాడు అమరావతి
ఏ గ్రామంలో చూసినా మద్యం ఏరులై పారుతుంది. గల్లీ కో బెల్ట్ షాప్ పెట్టి గ్రామాల్లో తాగుబోతుల లొల్లి అధికంగా ఉంటుందని పలు మహిళా సంఘాలు ఆరోపిస్తున్నారు. సమయపాలన లేకుండా గ్రామాలలో బెల్టు షాపులు నిర్వహించడం జరుగుతుందని దీని ద్వారా మద్యానికి బానిస అయిన వారు డబ్బులు లేక దొంగతనాలు చేసే పరిస్థితి గ్రామాల్లో నెలకొంది అని పలువురు మహిళలు ప్రజాసంఘాలు తెలిపారు. బెల్టు షాపు నిర్వాహకులు 50 వేలు చెల్లిస్తే చాలు అన్నిటికీ మేమున్నాం ప్రజలను దోచుకోండి అంటూ సిండికేట్ హామీలు గ్రామాల్లో వినిపిస్తున్నాయి. అసలు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు మద్యం విషయం ఇసుకపాలసి విషయం బహిరంగంగా మాట్లాడుతుంటే అందుకు అనుగుణంగా గ్రామాలలో మద్యం సిండికేట్లు విచ్చలవిడిగా తయారయ్యాయని స్థానిక ప్రజలు తెలిపారు. ధరలు తగ్గాయంటూ పాత స్టాక్ అయిపోయే వరకు షాప్ యాజమాన్యాల కొత్త స్టాకు తీసుకు రావట్లేదని మందుబాబులు ఆరోపిస్తున్నారు. ఉన్న సేలు గాని మధ్యమే మందు బాబులకు పంచ పక్ష పరమాణాలుగా మారింది. కొత్త ఎమ్మార్పీ ధరల పేరుతో ఉన్న పాత స్టాక్ ను వదిలించుకునేందుకు ఎలాంటి బ్రాండ్లు లేక పాత బ్రాండ్లకే మందుబాబులు బానిసవుతున్నారు. ఈ విషయమై పలువురు మహిళలు ప్రజా సంఘాలు ఏ అధికారికి చెప్పినా సిండికేట్ పేరుతో తనిఖీలు నిర్వహించలేకపోతున్నామని బహిరంగంగానే చెబుతున్నారు. సిండికేట్ అంటే ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ కాదు కదా అలాంటప్పుడు బెల్టులు ఎందుకు నిర్వహిస్తారు దానికి అధికారులు ఎందుకు సహకరిస్తారు అనే అంశం ప్రశ్నార్ధకంగా మారింది. పెదకూరపాడు నియోజకవర్గంలో క్రోసూరు,అచ్చంపేట ,బెల్లంకొండ, అమరావతి, పెదకూరపాడు మండలాలు తప్ప మరెక్కడా సిండికేట్ కనిపించడం లేదు.
ఎవరి సిండికేట్.... అధికారులను కట్టడి చేస్తున్న వ్యక్తులు ఎవరి సిండికేట్ అని పలువురు మహిళలు ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఏమన్నా అనుమతినిచ్చిందా ఈ సిండికేట్ కి నాయకులు ఎవరైనా చెప్పారా ఈ సిండికేట్ కి అని పలువురు మహిళలు నిలదీస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా సిండికేట్ పేర్లతో బెల్టులు నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు మహిళలు కోరారు. లేకుంటే బహిరంగంగా నిరసనలు తెలిపి స్థానికంగా జరుగుతున్న లోగుట్టును ప్రభుత్వానికి తెలియజేస్తామని ప్రజలన్నారు