ఐ లవ్ సత్తెనపల్లి ఆక్రిలిక్ త్రీడీ లైటింగ్ ప్రారంభించిన కన్నా
January 02, 2025
సత్తెనపల్లి : బెంజ్ న్యూస్
సత్తెనపల్లి పట్టణం తాలూకా సెంటర్ వద్ద సత్తెనపల్లి పట్టణ మరియు నియోజకవర్గానికి అభివృద్ధి సంక్షేమం ఆరంభం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఐ లవ్ సత్తెనపల్లి ఆక్రిలిక్ త్రీడీ లైటింగ్ ను సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ లైటింగ్ పట్టణానికి ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు, కూటమి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ,మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.